పేదల గుండెల్లో చిరస్థాయిగా ‘రాజన్న’ వైఎస్సార్‌కు ఘన నివాళి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్‌ 3 (ప్రతినిధి శాంతప్ప): తెలుగు ప్రజల గుండెల్లో ‘రాజన్న’గా చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని వజ్రకరూరు మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అందించిన సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.
పేదలు, రైతులు, విద్యార్థులు, నిరుపేద కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని నాయకులు పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో కోట్లాది కుటుంబాలకు అండగా నిలిచిన మహానేత వైఎస్సార్‌ అని కొనియాడారు. అధికారం కోసం కాకుండా పేదల కన్నీళ్లు తుడవడమే లక్ష్యంగా పనిచేసిన రాజన్న ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు.వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించడం, పేదలు మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవిబాయ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జగదీష్‌, మండల ఉపాధ్యక్షుడు ఉస్మాన్‌, మాజీ సర్పంచులు మోనాలిసా, కమలమ్మ, అల్లప్ప, టౌన్‌ ప్రెసిడెంట్‌ రవికాంత్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ సుశీలమ్మతో పాటు రాకెట్ల బాబు, ఎద్దటి రమేష్‌, రఘుపతి, ఆదినారాయణ, నెట్టికల్లు, మధుసూదన్‌, సామా నాయక్‌, కొనకొండ్ల గోవిందు, వీరభద్ర గౌడ్‌, రాముల నాయక్‌, హబీబ్‌, ప్యాపిలికిష్ట, బీమా తదితర నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *