
సాక్షి డిజిటల్ న్యూస్ మరికల్, సెప్టెంబర్ 3, ( రిపోర్టర్ ఇమామ్), బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతంలో భాగంగా నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ అరవింద్, మండల అధ్యక్షులు రవి యాదవ్, కోశాధికారి జడల బాలరాజు. సోషల్ మీడియా ఇంచార్జి తిరుమలేష్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, బహుజనుల హక్కులు మరియు అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని నియోజకవర్గం అధ్యక్షులు దాసరి అశోక్ పిలుపునిచ్చారు. సమావేశంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.