
(సాక్షి డిజిటల్ న్యూస్) సెప్టెంబర్ 3 మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ,రాఘవపేట గ్రామాల మధ్య ఉన్న పశువుల గ్రాసం కొరకు కేటాయించిన రెవెన్యూ భూమిని నడికుడ గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని, దానిని అదే గ్రామానికి చెందిన చందా నర్సారెడ్డి అనే వ్యక్తి భూ సర్వే చేపించేందుకు ప్రయాణిస్తున్నారని రెవిన్యూ అధికారులు అక్రమ దారునునికి సపోటుగా భూ రీ సర్వే చేసేందుకు ప్రయత్నం వెంటనే నిలిపివేయాలని కోరుతు లంచగొడ్డి ఆర్డీవో డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. అక్రమ పట్టాలను అడ్డుకోవాలని ఆరోపిస్తు బుధవారం మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయం ముందు రెండు గ్రామాల రైతులు బైటయించి నిరసన తెలిపారు.రైతులు మాట్లాడుతు…సర్వే నెం. 299/2/1, లో ఉన్న రెవెన్యూ భూమిని నడికుడ గ్రామస్థులు కొందరు D1 పట్టాలు చూపిస్తూ రిజిస్ట్రీ చేయిస్తున్నారని ఆ భూమికి రిజిస్ట్రీ చేయవద్దని, రెవెన్యూ రికార్డుల నుండి తొలగించి కాపాడాలని గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ పంచాయతీ పాలక వర్గం సమక్షంలో నిర్ణయించమన్నారు. 1976 నుండి ఉన్న ఈ భూమిని పశువుల మేత కోసం వదిలేశారని, ఇది రెండు గ్రామాలకు ఉమ్మడి ఆస్తి అని నడికుడ, రాఘవపేట సరిహద్ధుల భూ అక్రమ సర్వే రద్దు చేసి అక్రమ పట్టాలు సైతం రద్దు చేయాలనీ గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు.