పోలీస్ స్కావేంజర్స్, స్వీపర్స్ 18నెలల జీతాలు విడుదల చేయాలి

-టి. ఆర్. పి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ మంచిర్యాల్ జిల్లా బ్యూరో ఎండి యూసుఫ్ సెప్టెంబర్ 3 మంచిర్యాల రామగుండం కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న స్వీపర్స్, స్కావేంజర్స్ గా విధులు నిర్వహిస్తున్న వారికీ 18నెలలుగా జీతాలు రాక కుటుంబ పోషణ ఇబ్బందవుతుందని ఆవేదన చెందారు.డి. జి.పి కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి ద్రుష్టికి తీసుకు రాగా ఆయన మాట్లాడుతూ చిన్న ఉద్యోగస్థులు జీతం పై ఆధార పడి జీవిస్తూ కుటుంబాన్ని పొషించుకునే వారికీ 18నెలలుగా జీతాలు మంజూరు కాక పోవడం బాధాకరమని ఇప్పటికైనా రామగుండం కమిషనర్, రాష్ట్ర డీజీపీ లు స్పందించి వారికీ సకాలంలో జీతాలు అందించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *