పార్వతీపురంలో జనసేనాని జన్మదినోత్సవం.. హోరెత్తిన జనసేన శ్రేణులు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ / Sep 3 పార్వతీపురం మన్యం, బలిజిపేట మండలం, రిపోర్టర్ B.దుర్గారావు: బైక్ ర్యాలీతో హోరెత్తిన ప్రధాన రహదారులు.. ఘనంగా కేక్ కట్.. ఎల్ ఇ డి స్క్రీన్‌పై పిఠాపురం నుంచి యువజన విభాగం ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారం పార్వతీపురం: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ 55వ జన్మదినోత్సవ వేడుకలు పార్వతీపురం నియోజకవర్గంలో జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేనాని జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు భారీ ఉత్సాహంతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ముందుగా స్థానిక కొత్తవలస సమీపంలోని దుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి మార్కెట్ రోడ్ మీదుగా మెయిన్ రోడ్‌లోని ఎన్ జి ఓ హోమ్ భవనం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. జనసేన జెండాలు, పార్టీ నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో జనసేన కార్యకర్తలు, అభిమానుల నడుమ నియోజకవర్గ పి ఓ సి ఆదాడ మోహన్‌రావు కేక్ కట్ చేసి జనసేనాని పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తల నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఎల్ ఇ డి స్క్రీన్‌పై యువజన విభాగం ఆవిష్కరణ పార్టీ ఆదేశాల మేరకు పిఠాపురం కేంద్రంగా జనసేన యువజన విభాగం లోగో, విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురంలోని ఎన్ జి ఓ హోమ్ భవనంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ ఇ డి స్క్రీన్ ద్వారా జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. “రాష్ట్ర దశ దిశలను మార్చే శక్తి పవన్ కళ్యాణ్‌ది” ఈ సందర్భంగా నియోజకవర్గ పి ఓ సి ఆదాడ మోహన్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర దశ దిశలను మార్చే సత్తా, ప్రజల కోసం నిరంతరం పనిచేసే నిబద్ధత పవన్ కళ్యాణ్కి ఉన్నాయని అన్నారు. దేశ ప్రధానమంత్రి సైతం పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రశంసించడం ఆయనకున్న ప్రజాదరణ, నాయకత్వ పటిమకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సేవకు అంకితమైన జనసేనానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర పీఠాన్ని అధిరోహిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పడాల జయరాం బి దుర్గారావు మురళి రాజు ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యన్నారాయణ, నాయకులు రెడ్డి కరుణ, బంటు శిరీష్, రాజన రాంబాబు, పాటి శ్రీను, పిన్నింటి జయకృష్ణ, తులసి, రఘుమాండ అప్పలనాయుడు, గౌరీ, ప్రవీణ్, అనిల్, సురేష్, శివ, కాల్యంపూడి సత్య, ప్రకాష్, తవిటి నాయుడు,తదితరులతో పాటు పట్టణ, మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీ, కేక్ కటింగ్, యువజన విభాగం ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారంతో పార్వతీపురంలో జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *