పార్నపల్లిలో ఘనంగా డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ ,లింగాల ,సెప్టెంబర్ :03(పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసుల అంజనేయులు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పార్నపల్లిలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాలు జనసేన పార్టీ లింగాల ఇంచార్జ్ దాసరి నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగాయి.జన్మదిన వేడుకల సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరియు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.తదుపరి భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసులునాయుడు, కదిరి వంశీ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమిశ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.జనసేన శ్రేణుల నినాదాలతో పార్నపల్లి ప్రాంతం మారుమోగింది.పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమాలు ప్రజల్లో మరియు జనసేన అభిమానుల్లో విశేష ఉత్సాహాన్ని నింపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *