
సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గౌడ్ సెప్టెంబర్ 3 ఓల్డ్ బోయిన్పల్లి. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు – 420 హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య ఆతిద్యం లో ఓల్డ్ బోయిన్‌పల్లి భాగ్యశ్రీ గార్డెన్స్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొని మాట్లాడారు. 2009 నుంచి బోయిన్‌పల్లిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే తో కలిసి నిరంతరం కృషి చేశామని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను సమగ్రంగా అందించిందన్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఆడబిడ్డలకు పెద్దన్నగా నిలిచి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి గొప్ప సంక్షేమ పథకాలను అందించారని, దేశంలో మరే రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. బోయిన్‌పల్లిలో డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బోయిన్‌పల్లి డివిజన్ ప్రజలు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెంట ఉంటారని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతామని ముద్దం నర్సింహ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్, సయ్యద్ ఇజాజ్, ఇర్ఫాన్, హరినాథ్, బలవంత్ రెడ్డి, కర్రె జంగయ్య, మక్కల నర్సింగ్ రావు, గడ్డం నర్సింగ్ రావు, ఖదీర్, లలిత గౌడ్, అనురాధ, రాజేశ్వరి, దుర్గ, హఫీజా సరోజ, ఉదయరాణి తదితర ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ ముద్దం నర్సింహ యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్‌లో కూడా ప్రజా సమస్యలపై ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.