బడి కావాలి ఎమ్మెల్యేకు చిన్నారుల వేడుకోలు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల్ రిపోర్టర్ జి.ఎస్.కె సెప్టెంబర్ 03/26 సారూ.. చదివి మేము బాగుపడతాం.. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు సంచార జాతి పిల్లల విజ్ఞప్తి.. పిల్లల ఆసక్తి చూసి చలించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. అప్పటికప్పుడు విరాళాలతో ముందుకు వచ్చిన దాతలు.. విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తా – ఎమ్మెల్యే వీర్లపల్లి అయ్యా మేము చదివి బాగుపడతాం.. మాకు ఒక బడి కావాలి.. ఆదరించే ఓడి కావాలి.. అక్షరాలు నేర్చుకుంటాం.. అభ్యుదయం వైపు పయనిస్తాం.. అంటూ రోడ్డు పక్కన జీవించే సంచార జాతుల పిల్లలు నేరుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ప్రభుత్వ క్యాంపు కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందించారు. ఈ పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్న బడులలో చదువుకుంటున్నారు. దూర భారం ఎక్కువ కావడం, వాహన సదుపాయం లేకపోవడంతో కొంతమంది చదువు మానేసి ఇంటి పక్కనే ఉంటున్నారు. కొంతమంది దాతల సహకారంతో వాహనాలలో చదువుకునేందుకు వెళుతున్నారు.బడి చదువులు లేక తమ జీవితం అంధకారంగా మారుతుందని, చదువుకొని తమ జీవితాలను, తమ తల్లిదండ్రుల జీవితాలను మారుస్తామని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఒక్కసారిగా చెల్లించి పిల్లలను చేరదీసి వారికి బడి కట్టించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నిర్ణయంతో కొంతమంది దాతలు అప్పటికప్పుడు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తామని చెప్పడంతో ముందుగా మధురాపూర్ గ్రామవాసి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి బాలరాజు గౌడ్ 51000 రూపాయలు అందించారు. అదేవిధంగా మరికొంతమంది నేతల ద్వారా రూ. పది లక్షలు హామీ మొత్తం పొందారు. ఇప్పటికే సొంత ఖర్చులతో కళాశాల నిర్మాణం ద్వారా కళాశాల విద్యార్థులకు చేయూతను అందిస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తాజాగా బడి పిల్లల మీద కూడా దృష్టి సారించడం ప్రశంసలు అందుకుంటుంది. ఉన్న చోటే వీరికి బడి – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచార జాతుల పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్లి చదువుల కోసం ఇబ్బంది పడటం సరికాదని, వారు ఉన్నచోటనే 10 శాతం ప్రభుత్వ స్థలంలో వారికి బడి నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీర్మానించారు. దాతల సహకారంతోపాటు తన సొంత డబ్బులతో పాఠశాల భవనాన్ని నిర్మించి పిల్లలకు చదువును చేరువయ్యేలా చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలు చదువుకోవాలని ఆసక్తి ఉండడం గొప్ప విషయమని, అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలు భవిష్యత్తులో ఎంత ఉన్నతికి ఎదగాలనుకున్న తన సహకారం తప్పనిసరిగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిన్నారులను చూసి వెంటనే బడి కట్టిస్తా అని నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు అక్కడ ఉన్నవారు శంకరన్న నువ్వు సూపర్ అంటూ అభినందించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి సైతం ఎమ్మెల్యే కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, ఎంఈఓ మనోహర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, సిఐటియు నేత రాజు, కౌన్సిలర్ కోప్పునూరు ప్రవీణ్ కుమార్, లింగారెడ్డిగూడెం ఉప సర్పంచ్ అశోక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *