బిజెపి కార్యాలయం పై దాడి హేయమైన చర్య

అడ్డగూడూరు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ 03.09.26 అడ్డగూడూర్ రిపోర్టర్ నోముల ఉపేందర్. బిజెపి రాష్ట్ర కార్యాలయం పై కాంగ్రెస్ నాయకుల దాడి హేయమైన చర్యని అడ్డగూడూర్ బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు అన్నారు. బుధవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నిరసన వ్యక్తం చేయాలి తప్ప దౌర్జన్యాలకు పాల్పడడం సరికాదన్నారు. రాజకీయంగా బిజెపి పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజల కోసం ఏ సమస్య వచ్చినా వాటిపై కొట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే బిజెపి పార్టీ పనిచేస్తుందన్నారు. భువనగిరి, నల్లగొండ బిజెపి పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రోడ్లు, ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ ఆస్పత్రుల, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ప్రజలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్టీ కార్యాలయల పై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. రానున్న రోజులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *