రెవెన్యూ శాఖలో గోపాలకృష్ణ సేవలు అభినందనీయం

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 నడిగూడెం మండలం రిపోర్టర్ షేక్ రఫీ నడిగూడెం మండలంలో రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో గోపాలకృష్ణ చేసిన సేవలు మరువలేనివని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ పేర్కొన్నారు నడిగూడెం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నిధులు నిర్వహించి పదవి విరమణ పొందిన గోపాలకృష్ణ వీడ్కోలు అభినందన సభ స్థానిక తహసిల్దార్ ఎల్ మంగా అధ్యక్షతన బుధవారం నిర్వహించారు ముఖ్యఅతిథిగా మార్కెట్ చైర్ పర్సన్ పాల్గొని మాట్లాడుతూ మండల వాసిగా తన ఉద్యోగరీత్యా ప్రజలకు ఎంతగానో సుపరిచితుడుగా ఉంటూ సేవలందించి అందరి మనల్ని పొందారని ఆయన సేవలను కొనియాడారు ఉద్యోగంలో విరమణ ఉంటుంది కానీ సేవలో విరమణ ఉడదని భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవలు చేయాలని ఆమె ఆకాంక్షించారు పలువురు సర్పంచులు ప్రజాప్రతినిధులు విశ్రాంత ఉద్యోగులు గోపాలకృష్ణ సేవలను అభినందించారు వీడ్కోలు సమావేశంలో మునగల తాసిల్దార్ సరిత మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు బూత్కూరు వెంకటరెడ్డి నడిగూడెం సర్పంచ్ దున్న శ్రీనివాస్ నడిగూడెం కాగిత రామచంద్రపురం పీఎస్సీ ఎస్ చైర్మన్లు కొల్లు రామారావు సంధ్య లింగారెడ్డి కాంగ్రెస్ బారాస సిపిఎం పార్టీల బాధ్యులు బిక్షపతి నర్సిరెడ్డి సత్యనారాయణ కేశవపురం సర్పంచ్ గోసుల రాజేష్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నీలిమ గాంధీ కార్యదర్శి పల్లపు శ్రీను ఉపసర్పంచ్ ఎలుగురినాగరాజు విశ్రాంత తాసిల్దారులు జోసఫ్ బిక్షం రెవెన్యూ ఉద్యోగులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు నాయకులు అభినందన సభలో పాల్గొని గోపాలకృష్ణ ను ఘనంగా సన్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *