వైఎస్ఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ కూడేరు సెప్టెంబర్ 3 అనంతపురం జిల్లా ఇన్చార్జ్ కూడేరు మండల పరిధిలోని ఇప్పేరు గ్రామంలో దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు ఇప్పేరు కేశన్న, ఎంపీటీసీ దొడ్డికల్లు రమేష్, గ్రామ అధ్యక్షులు కిష్టప్ప, ధనంజయ, భాష, తిమ్మారెడ్డి, భీమన్న, నాయకులు, కార్యకర్తలు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమం కోసం మహానేత వైఎస్ఆర్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *