
సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ :బొక్కా నాగేశ్వరరావు సెప్టెంబర్ 3 2026 కంచికచర్ల పట్టణ అధ్యక్షులు వేమ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పాల్గొన్నారు.మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కంచికచర్ల పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పేదలకు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు పారదర్శక పాలనా అందించి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.చరిత్రలో నిలిచిన పథకాలైన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి పథకాలను అమలు చేసి సమాజంలోని అసమానతులను తొలగించి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆయన స్పూర్తితోనే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పథకాలతో పాలన కొనసాగించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంచికచర్ల పట్టణ,మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.