బడుగు బలహీన వర్గాల సంక్షేమ ప్రదాత వైఎస్సార్‌

-పేద ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు -జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 గూడూరు రిపోర్టర్ చెన్నూరు మస్తాన్ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి విశేష కృషి చేసిన నాయకుడు స్వర్గీయ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అందించిన సుపరిపాలన, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌ తరహా పాలన తిరిగి రావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలను గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ముందుగా శాంతినగర్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించి పలువురి నుంచి రక్తాన్ని సేకరించారు. రక్తదాతలను నాయకులు అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌ వంటి సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయన్నారు. జలయజ్ఞం ద్వారా మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించి వ్యవసాయానికి ఊతమిచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్‌, జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించడం తప్ప కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకురాలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్‌ అమలు చేసిన పథకాలు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయని అన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, గూడూరు పట్టణ అధ్యక్షుడు బోమిడి శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు ఎద్దల నరేంద్రరెడ్డి, కోడూరు మీరారెడ్డి, కుమారస్వామిరెడ్డి, బత్తిని విజయకుమార్‌, చిల్లకూరు జడ్పీటీసీ మన్నెం శ్రీనివాసులు, నాయకులు భక్తవత్సలరెడ్డి, మాగ్దూం, అట్ల శ్రీనివాసులురెడ్డి, ఎల్లా శ్రీనివాసులురెడ్డి, మహేంద్ర యాదవ్‌, బల్లి వెంకటేశ్వర్లు, మనుబోలు కృష్ణయ్య, ఈదూరు ప్రసాద్, సంపత్‌కుమార్‌, సుభాన్‌ తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *