ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావులపాలెంలో ఘనంగా ప్రపంచ కొబ్బరి దినోత్సవం

🖨️ Print

రావులపాలెం సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 రిపోర్టర్ పులుపు కరుణాకర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ అధ్యాపకులు ఎన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి శ్రీ వరం అధ్యక్షతన ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి కే సునీత ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ కొబ్బరి మనిషి జీవన విధానంలో ఒక భాగమని ఈ కొబ్బరి ఉత్పత్తులను అందరూ ప్రోత్సహించాలని, వీటి క్రయ విక్రయాలు పంటల పెంపుదల, వాటి పోషణలు, ఎగుమతి విధానాలు, కొబ్బరి ప్రపంచ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, స్థాయి లలో మార్కెటింగ్ విధానాలు గూర్చి మరియు కొబ్బరి రైతులకు పంట దిగుబడి విధానాలను గూర్చి, కోనసీమ కొబ్బరి భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినదని సర్ ఆర్థర్ కాటన్ దొర ఆనకట్ట వలన గోదావరి వాసులకు కొబ్బరి పంటలు, ఎగుమతులు, ఎంతగానో అభివృద్ధి చెందినయని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి ఎస్ అరుణ్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ చిన్నబాబు అధ్యాపకులు పవన్, సౌజన్య, వెంకటలక్ష్మి, యువరాజ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *