
సాక్షి డిజిటల్ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల్ రిపోర్టర్ జి.ఎస్.కె సెప్టెంబర్ 03/26 కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ పైర్ షాద్ నగర్ లో భారీ ర్యాలీ నిరసన అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన షాద్ నగర్ గులాబీమయం.. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నిప్పులు 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన.. వందలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు షాద్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజా పాలన కంటే అవినీతి, అసమర్థత, అరాచక పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ అధిష్టానం విడుదల చేసిన చార్జ్ షీట్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో గులాబీమయం షాద్ నగర్ చౌరస్తా నుంచి రోడ్డు పొడవునా సుమారు 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఏర్పాటు చేసిన ఈ భారీ ఫ్లెక్సీతో చౌరస్తా గులాబీమయంగా మారింది. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, యువత వందలాదిగా తరలివచ్చారు. దీంతో ప్రధాన రహదారి బీఆర్ఎస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ హామీలు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాజీ ఎంపీపీ యువనేత వై. రవీందర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ వైస్ చైర్మన్ నటరాజన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, ఎం. సత్యనారాయణ మన్నే నారాయణ యాదవ్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, యూరియా, సాగునీరు వంటి అంశాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రజా సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ యాదవ్, ఈట గణేష్, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..