
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 తిరుమలగిరి మండలం సూర్యాపేట జిల్లా సెప్టెంబర్ 2 బుధవారం రోజున సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం మందకృష్ణ మాదిగ ఉద్యమ తిరుమలగిరి మండలంలో నవ సమాజ నిర్మాత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన మండల కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు, తిరుమలగిరి మండల ఇన్చార్జ్ యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ రాష్ట్ర సీనియర్ నాయకులు కందుకూరి సోమన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఏపూరి రాజు మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారా దళిత సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా అంతర్గతంగా పేరుకుపోయిన అసమానతలు క్రమంగా తొలగిపోతున్నాయని అన్నారు. ఇప్పటివరకు అవకాశాలకు నోచుకోని మాల, మాదిగ తదితర ఎస్సీ ఉపకులాలకు వర్గీకరణ ద్వారా విద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత అవకాశాలు లభించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ దళిత సమాజంలో సమానత్వ సాధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కుల వివక్ష, పేదరికం, అణచివేత కారణంగా సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తీవ్రంగా పెరిగాయని అన్నారు. ఈ అసమానతలను, సామాజిక రుగ్మతలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ లక్ష్యంతోనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ భవిష్యత్ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తిరుమలగిరి మండలానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన మండల కమిటీలను ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ తిరుమలగిరి మండల కమిటీ – అధ్యక్షులు: మల్లెపాక అనిల్ మాదిగ – అధికార ప్రతినిధి: కొమ్ము లక్ష్మీనారాయణ మాదిగ – ఉపాధ్యక్షులు: జెర్రిపోతుల శ్రీకాంత్ మాదిగ
– ప్రధాన కార్యదర్శి: ఏపూరి ఉపేందర్ మాదిగ – కార్యదర్శి–1: ఎర్ర ప్రణయ్ మాదిగ – కార్యదర్శి–2: కొమ్ము సుమన్ మాదిగ – కార్యదర్శి: గోల్కొండ సైదులు మాదిగ – సహాయ కార్యదర్శి–1: వేముల శ్రావణ్ – సహాయ కార్యదర్శి–3: కొమ్ము మహేష్ – సహాయ కార్యదర్శి: ఈదుల నరేష్ మాదిగ తిరుమలగిరి మహాజన సోషలిస్టు పార్టీ ఎం ఎస్ పి మండల కమిటీ – అధ్యక్షులు: కొమ్ము బిక్షపతి మాదిగ – అధికార ప్రతినిధి: పల్లెర్ల వెంకన్న మాదిగ – ప్రధాన కార్యదర్శి–1: ఏపురి ఐలయ్య మాదిగ – ఉపాధ్యక్షులు–1: ఏపూరి నాంచారయ్య. – కార్యదర్శి: బండారి రామ్మూర్తి – తదితరులను ఎన్నుకున్నారు – ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన మండల కమిటీ సభ్యులకు నాయకులు అభినందనలు తెలిపారు. మండల స్థాయిలో సంస్థను బలోపేతం చేసి అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. తిరుమలగిరి మండల కమిటీ టౌన్ అధ్యక్షునిగా కందుకూరి మహేష్ మాదిగను నియమాకం చేయడం జరిగింది.