అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్ లో మొరాయించిన బస్సు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ ఆగస్టు 3 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు ముందకు కదలక మోరాయించింది.దీంతోఆర్టీసీ డ్రైవర్ తోపాటు పలువురు ప్రయాణికులు తోయడంతో బస్సు కదలక నిశ్చల స్థితిలో ఉండిపోయింది.దాంతో ప్రయాణికులు ఇంకా కాస్త గట్టిగా దొబ్బడంతో బస్సు కదిలిన కాసేపటికి ఇంజన్ ఆగిపోయింది. అధికారులు ప్రయాణికులను వేరే బస్సుకు ఎక్కించే మార్గాలు సూచించారు‌. చివరికి బస్సు అటు ఇటు ప్రయత్నించడంతో కొంత కదలికల వల్ల స్టార్ట్ అయ్యి హైదరాబాద్ బయలుదేరింది. బస్సు హైదరాబాద్ గమ్యస్థానకి చేరవేస్తుందా లేదా అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.ఆర్టీసి అధికారులు దూర ప్రాంతాలకు మంచి ఫిట్ నెస్ ఉన్న బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *