
సాక్షి డిజిటల్ న్యూస్: 03 సెప్టెంబర్, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7న తెలంగాణలో పర్యటించనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడితో సమావేశమై, భద్రాచల రామాలయ ప్రాధాన్యత, జిల్లాకు విమానాశ్రయం అవసరాన్ని వివరించారు. సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వస్తే తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.