వైఎస్సార్ సేవలు సంక్షేమానికి చిరునామా

ఘనంగా 17వ వర్ధంతి వేడుకలువిగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద, సెప్టెంబర్ 3 దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను హోళగుంద మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ షఫీ ఉల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బూసినే వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజా సంక్షేమ పాలనను గుర్తుచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు అండగా నిలిచారని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్.. పేద విద్యార్థులకు ఉన్నత విద్య.. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందించిన ఘనత వైఎస్సార్ పాలనకే దక్కుతుందని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు. పేదల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. ఆయన ఆశయాలు, ప్రజా సేవా స్ఫూర్తి నేటి తరానికి కూడా ఆదర్శమని పేర్కొన్నారు.
పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలను స్మరించుకోవడమే కాకుండా.. ఆయన చూపిన ప్రజా సంక్షేమ మార్గంలో నడుస్తూ ప్రజలకు అండగా నిలవడమే మహానేతకు అందించే నిజమైన నివాళి అని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ షఫీఉల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, ఎంపీపీ తనయుడు ఈసా, ఎంపీటీసీ మల్లికార్జున, హనుమప్ప, జొండ, సిద్ధయ్య, వెంకటేష్, నాగప్ప, కొండ అమ్రేష్, రహమతుల్లా, మంజునాయక్, నాగరాజు, సిద్ధలింగ, ఈరన్న, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, మాజీ సొసైటీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, డైరెక్టర్లు, ఆయా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *