కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిప్పులు

మానకొండూరులో రసమయి బాలకిషన్ సంచలన సవాల్
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్, అర్సీ ఇంచార్జి, గోపు మహిపాల్ రెడ్డి, సెప్టెంబర్ 3, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు నాయకత్వంలో, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ నిరసనలో భాగంగా ఏర్పాటు చేసిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిర్వహించిన మానవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.అమలు చేయకపోతే చెప్పు దెబ్బలు తింటారా రసమయి బాలకిషన్ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే బహిరంగంగా క్షమాపణ కోరాలి. అమలు చేయని హామీలను ఇప్పటికైనా అమలు చేస్తారా లేక ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తింటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రసమయి బాలకిషన్ ఈ సందర్భంగా ఒక సంచలన సవాల్ విసిరారు. “ఎమ్మెల్యే కవ్వంపల్లి స్వగ్రామమైన పచ్చునూరులో, ప్రజలు, మీడియా సమక్షంలో బహిరంగ ఓటింగ్ కు నేను సిద్ధం. ఈ ఓటింగ్‌లో నాపై కవ్వంపల్లి గెలిస్తే నేను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటాను. ఒకవేళ ఆయన ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని రసమయి సవాల్ చేయడంతో మానకొండూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, వేలాది మంది గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *