ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ధర్మారం, పి ఎచ్ సి గీసుకొండలను, చింతల్ సబ్ సెంటర్, పి ఎచ్ సి సంగెం తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు వరంగల్ జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి గారు జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ధర్మారం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గీసుకొండలను మరియు చింతల్ సబ్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంగెం లను బుధవారం సందర్శించి, అక్కడ అందిస్తున్న ఆరోగ్య సేవలను పరిశీలించారు. మొదట ఎ ఎ ఎం ధర్మారంను సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ సెషన్‌ను పరిశీలించారు. వ్యాక్సినేషన్ రికార్డులను తనిఖీ చేసి, చిన్నారులు మరియు గర్భిణీలకు నిర్దేశిత టీకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సబ్ సెంటర్‌కు సంబంధించిన అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సాధించ వలసిన అంచనా స్థాయి ప్రకారం అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో పనితీరును మెరుగుపరచాలని ఆదేశించారు. తదుపరి పి ఎచ్ సి గీసుకొండను సందర్శించి రికార్డులను పరిశీలించారు. హెడ్‌క్వార్టర్స్ సిబ్బందితో సమీక్ష నిర్వహించి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను పెంచాలని తెలిపారు. గీసుగొండ వైద్య అధికారి, డాక్టర్ శౌర్య శరణ్య కు పి ఎచ్ సి పరిసరాలను మళ్ళీ ఒకసారి శుభ్రం చేయించు మని సూచించారు. అనంతరం చింతల్ సబ్ సెంటర్ను సందర్శించి ఇమ్యూనైజేషన్ సెషన్‌ను పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణను పరిశీలించి, అర్హులైన ప్రతి చిన్నారికి, గర్భిణీకి టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తదనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంగెం ను సందర్శించి, మాతా-శిశు ఆరోగ్య సేవలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు సాధారణ ప్రసవాలు పెరిగేలా గర్భిణీలకు అవగాహన కల్పించాలని డి ఎం ఎచ్ ఓ సూచించారు. గర్భిణీలను ముందుగానే గుర్తించి, అవసరమైన ఎ ఎన్ సి సేవలు అందిస్తూ, సురక్షిత ప్రసవాల కోసం ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు వచ్చేలా ఆశలు, ఎ ఎన్ ఎమ్ లు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే పి ఎచ్ సి పరిధిలోని ప్రజలకు నాణ్యమైన, సకాలంలో ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో పనితీరును మెరుగుపరచాలని, ఐ ఈ సి ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నియంత్రణ కొరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. టి బి నివారణ లో భాగంగా ప్రతి ఆశ పది మంది అనుమానితుల గుర్తించి థెమడ పరీక్షలు చేయించాలి అని అన్నారు. ఈ తనిఖీ సందర్భంగా పి ఎచ్ సి సంగెం నందు స్థానిక వైద్యాధికారులు డా. వంశీకృష్ణ, డా. జి. నవీన్, స్థానిక ఎచ్ ఇ ఓ సాంబయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి ఎస్. వెంకటేశ్వర్లు, డిప్యూటీ డెమో మరియు ఎచ్.ఇ.ఓ. సదానందం, తదితర వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *