420 అడుగుల భారీ ఫ్లెక్సీతో ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ.

6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలి. మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్.
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ల పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఇల్లందు నియోజకవర్గంలో ఘనంగా విజయవంతమైంది. ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బానోత్ హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నిర్వహించిన భారీ ర్యాలీ ఇల్లందు నియోజకవర్గంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్నప్పటికీ, ఎన్నికల సమయంలో 100 రోజుల్లోనే అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో చేపట్టిన ర్యాలీలో బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ బి.ఆర్.ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల తరఫున తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. హామీల అమలులో ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల బీఆర్‌ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు పానుగంటి రాధాకృష్ణ, మహ్మద్ ఖదిర్ బాబా, బానోత్ బాలు, బుడిగ మురళి, శీలంశెట్టి రమేష్, బాధవత్ రాందాస్, అలాగే పార్టీ నాయకులు గుడిచుట్టి నాగయ్య, బీరవెల్లి లక్ష్మారెడ్డి, రత్నవత్ శంకర్, నునవత్ నరసింహ, కిషన్, ముంగి రాములు, తాళ్లూరి రవీందర్, ప్రభాకర్, గట్టు శంకర్, చిర్ర శ్రీను, వెంకన్న, గడ్డం అశోక్, లక్ పతి, భూక్యా రాజు, గణేష్, యాకుబ్, రామకృష్ణ, అభి, శ్రీనాద్, యాకుబ్ టైల్స్ ఉమేష్, మారుతీ వీరన్న, అనిల్, గణేష్, రాంబాబు, నిఖిల్, వంశీ, బాల్ కుమార్ తదితరులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *