
సాక్షి డిజిటల్ న్యూస్ 03 కొందుర్గ్.. రంగారెడ్డి జిల్లా.కొందుర్గ్ మండలంలోని బైరoపల్లి గ్రామంలో నేడు వికసిత్ భారత్ రాంజీ గ్రామ స్వరాజ్ యోజన ఉపాధి పథకంపై గ్రామ సభ నిర్వహించారు గ్రామ సబ సర్పంచ్ పెద్దింటి జంగమ్మ ఆధ్వర్యంలో వివిధ గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రచించారు గ్రామంలో త్రాగు నీరు సమస్యలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని గ్రామ పరిసరాలు ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండేలా మరి ముక్యంగా వ్యక్తి గత పరిశుభ్రత చాలా ముఖ్యమని సర్పంచ్ తెలిపారు ఈ సభకు ఏ పి ఓ నర్సింగ్ రావు హాజరై గ్రామ అభివృద్ధికి ఉపాధిహామీ పథకంలో ప్రణాళికను తయారు చేసి పనులు ప్రారంభించాలని ఆయన గ్రామపంచాయతీ కార్యవర్గాన్ని కోరారు గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో రోడ్లు మురుగు కాలువలు భవనాలు నిర్మించుకోవాలని,సమృద్ధిగా.వనరులను ఏర్పాటు చేసుకోవచ్చునని గ్రామాల్లో వర్షాలు కురుస్తున్న నందున పెద్ద మొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమైన వన మహోత్సవం నిర్వహించాలని ,గ్రామాల్లో నీటి సామర్థ్యం పెంచే ఇంకుడు గుంతలు ప్రతిఒకరు నేర్పాటు చేసుకోవాలని దాని వల్ల గ్రామంలో నేటి నిల్వ సామర్థ్యం పెరిగి భవిష్యత్ అవసరాలకు నీటి కొరత ఏర్పడకుండా ఉంటుందని తెలిపారు. గ్రామానికి ఉపయోగపడే అబివృద్ధి పనులను వి బి జీ రామ్ జీ యాక్ట్ ద్వారా పూర్తిచేసుకోవాలని మండల ఉపాధి హామీ అధికారి నర్సింగ్ రావు తెలిపారు.. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఝాన్సీ రాణి గ్రామ సర్పంచ్ పెద్దింటి జంగమ్మ తనయుడు శ్రీకాంత్ ఉపసర్పంచ్ కుంట్టోళ్ళ నరేష్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిన్న బొక్కి ప్రసాద్ వార్డ్ సభ్యులు బీర్లా రాణి కృష్ణ, మహమ్మద్ జహంగీర్, మంజుల మల్లేష్, కందివనం రమేష్ కంటే,మల్లేష్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతిర్మయి , వీ ఓ ఏ శిరీష , ఆశా వర్కర్ జ్యోతి. జంగయ్య రమేష్ సురేష్.. పాల్గొన్నారు.