విలక్షణ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ..

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ మెరుగు నరేష్ గౌడ్ ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖనిలో పవన్ కళ్యాణ్ అభిమాని సితకారి గంగరాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు పరస్పరం కేక్ తినిపించుకొని ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సులువ లక్ష్మీ నరసయ్య, బిజెపి లేబర్ సెల్ పెద్దపెల్లి జిల్లా కన్వీనర్ తడగొండ నరసయ్య మహిళా మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలుక భారతి, ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మచ్చ విశ్వాస్,బిజెపి పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఎల్తూరి సరిత మరియు అంతర్గాం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్, పాలకుర్తి మండల అధ్యక్షుడు మెరుగు నరేష్ గౌడ్, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ నాయకులు సులువ పద్మ, కోడూరు రమేష్,కొట్టే నరేష్, అందే రాజ్ కుమార్ చారి, శీతకారి గంగరాజు, జక్కుల ప్రవీణ్–పద్మ, ఎల్తూరి రాజయ్య, పాకాల నరసింహారెడ్డి, హనుమాన్ల వెంకటేష్, అంకరి భరత్, బూడిద హర్ష,మిస వికాస్ జక్కన బాలు, బుంగ మహేష్, జనగామ శివరాం, లింగాల శంకర్ తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *