రొంపిచెర్లలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.

🖨️ Print

సాక్షి డిజిటల్న్యూస్ సెప్టెంబర్ 3  చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రిపోర్టర్ భీమనేని బాలకృష్ణ. : ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రొంపిచెర్ల మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన టీఏ, డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, మధ్యంతర భృతి (ఐఆర్‌)ను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, ఉద్యోగులకు వేతన సవరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కోరారు. కొత్త పెన్షన్‌ విధానాన్ని (సీపీఎస్‌) రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం వీఆర్ఏల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మండల సర్వేయర్ ద్వారకనాథ్, జూనియర్ అసిస్టెంట్ ముని శేఖర్,  వీఆర్వో లు సుబ్రహ్మణ్యం, సురేంద్ర, బావాజీ, శ్రీనివాసులు, శ్రీరాములు, అటెండర్ చాంద్ సుల్తాన, వీఆర్ఏ లు నజీర్ సాహెబ్, ఇర్ఫాన్ అలీ, నరేష్, దామోదర్, మల్లికా, శిరీష, రామచంద్ర, విశ్వనాధం, రాజన్న, ధనశేఖర్, వెంకట రమణ, విలేజ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *