
సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 03, ఓదెల రిపోర్టర్ క్యాతం రమేష్ : ఓదెల గ్రామంలో మంజూరు కాబోయే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నమూనాను మార్చాలి అని ఓదెల గ్రామ సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రస్తుతం డి 86 కెనాల్ నుండి రైల్వే ట్రాక్ పై నుండి హై స్కూల్ రోడ్ లోని పెంట ఐలయ్య ఇంటి వరకు మంజూరు అయింది. ఇట్టి బ్రిడ్జికి తారకరామ కాలనీ గేట్ ప్రక్కన గల అప్రోచ్ రోడ్ పైన బ్రిడ్జి పల్లె ప్రకృతి వనం దగ్గర ఫ్లై ఓవర్ కి అటాచ్ చేయడం వలన తారక రామ కాలనీ గేట్ వద్ద అండర్ బ్రిడ్జి అవసరం ఉండదు, అలాగే బ్రిడ్జి కింద నుండి రోడ్ అవసరం ఉండదు, జిల్లా కేంద్రం నుండి నేరుగా తారకరామ కాలనీ వద్ద టి బ్రిడ్జి నిర్మాణo చేస్తే ఎలాంటి రైల్వే గేట్ అడ్డంకి లేకుండా జమ్మికుంట కు భవిష్యత్తు లో పేట బ్రిడ్జి పై నుండి రాకపోకల కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే మండల కేంద్రానికి వెళ్ళే వారు నేరుగా వెల్ల వచ్చు అని టి బ్రిడ్జి అన్ని విధాలుగా ప్రజలకు సౌకార్యంగా ఉంటుంది అని శాసనసభ్యులు విజయ రమణా రావు కి వివరించగా ఆయన స్పందించి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ద్వారా వివరించామన్నారు.