నెత్తుటి మరకల దినం , కొండు బానేష్ సిపిఐ మండల కార్యదర్శి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ మంచిర్యాల్ జిల్లా బ్యూరో ఎండి యూసఫ్ సెప్టెంబర్ 3 అమర ధామం (పరకాల) నెత్తుటి మరకల దినం, 1947 సెప్టెంబర్ 2న వరంగల్ జిల్లా పరకాలలో జిలియన్ వాలా బాగ్ దుర్ఘటనను తలపించే సంఘటన జరిగిన దుర్దినం భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలని విఓచన ఉద్యమకారులు ఆందోళనకు దిగారు సెప్టెంబర్ 2న 1947 పరకాల పట్టణ సమీపంలో ఉన్న పైడిపల్లి తాళ్ల నుంచి వియోచను ఉద్యమ కారులు భారత జాతీయ జెండా ఎగురవేయడానికి పరకాలకు వస్తున్నారు రజాకార్లు ఈ విషయం పసిగట్టి నిజాం చే వియోచన ఉద్యమ కారులు జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకోమని ఆదేశం జారీ చేయించారు, కాశీం రజ్వి నేతృత్వం లోని రజాకారులు వియోచన ఉద్యమ కారులను ఊచ కోత కోశారు, పరకాల చాపల బండ వద్ద గుమగుడిన వియోచ నోద్యమ కారులపై దాడి చేశారు, కత్తులు, బల్లాలు, బరిసెలతో మరణ కాండ కొనసాగించగా 13 మంది ఉద్యమకారులు అక్కడికక్కడే దారుణమరణం చెందారు, మరో ఆరుగురు ఆసుపత్రిలో మృతి చెందారు, మరో ముగ్గురిని రంగాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి దారుణంగా గొడ్డలి బరిసెలతో తుపాకులతో కాల్చి చంపారు, 200 మందికి పైగా ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారు, వరంగల్ జిల్లా జలియన్ వాలా బాగ్ గా ఈ సంఘటన ప్రాచుర్యం పొందింది ఆ అమరవీరులకు జోహార్లు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *