
సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3 చొప్పదండి నియోజకవర్గం రిపోర్టర్ కొండూరి సురేష్; జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలలో బుధవారం జగిత్యాల జిల్లా తెలుగు భాష ఫోరం వారి ఆధ్వర్యంలో మండల తెలుగు భాష ఉపాధ్యాయులు పద్య పఠన పోటీల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పద్య పఠన పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మండల విద్యాధికారి మాట్లాడుతూ… నేటి కాలంలో పద్య పఠన ఆవశ్యకత ఎంతో ఉందని నీతి పద్యాలు చదవడం వల్ల మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులు తెలుసుకోగలుగుతారని అన్నారు.ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మండల విద్యాధికారి ప్రశంస పత్రాలు, మెమంటోలు అందచేశారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర అధ్యక్షతన మొదటిసారి జరిగిన ఈ పద్య పఠన పోటీల కార్య క్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొని బహుమతులు అందుకున్నారు. గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించనున్న పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగు భాష ఉపాధ్యాయులు వెంకట రమణ, కే.అనిత, ఏ.శేఖర్, సుమన్, అంజయ్య సరోజన పాల్గొన్నారు.