నష్ట పరిహారం చెల్లించాకే పైపు లైన్ నిర్మాణం చేపట్టాలి

భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామచంద్రారెడ్డి.
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లి, సెప్టెంబర్ :03 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసుల అంజనేయులు) రైతులకు నష్ట పరిహారం చెల్లించాకే పైపు లైన్ నిర్మాణం పనులు చేయాలని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామచంద్రా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు చక్రాయపేట మండలం నేర్సుపల్లి గ్రామం కొండప్ప గారి పల్లె నుండి నేర్సుపల్లి క్రాస్ లో ఆర్.వి .ఆర్ కన్స్ట్రక్షన్ గండికోట నుండి చిత్తూరు జిల్లా కుప్పం నికి నీరు తరలిస్తున్న పైపు లైన్ నిర్మాణాన్ని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్, రైతులతో కలసి అడ్డుకుని నిరసన తెలియజేసారు. అనంతరం వారు వారు మాట్లాడుతూ రైతులకు చెందిన పంట పొలాలకు,మామిడి నిమ్మ చెట్లకు బోరు పంపులకు నష్టపరిహారం చెల్లించకుండా రైతులకు ముందస్తు నోటీసులు సమాచారం తెలుపకుండా దౌర్జన్యముగా కాలవ పైపులైన్ నిర్మాణం చేయడం దారుణమని చెప్పారు.దీనివలన చక్రాయపేట మండల కరువు రైతులకు తీవ్రర నష్టం కలుగుతుంది కావున సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. అదేవిధంగా కలేటి వాగు ప్రాజెక్టు కాలువలను సత్వరముగా పూర్తిచేసి చక్రాయపేట మండలంలోని అన్ని చెరువులకు కుంటలకు సాగునీరు,తాగునీరు అందించలని కోరారు. అక్రమ నిర్మాణం చేపడుతున్న ఆర్. వి.ఆర్. కన్స్ట్రక్షన్ వారిపై అధికారులపై తగిన చర్యలు తీసుకొని న్యాయంగా రైతులకు పంట నష్టపరిహారం జీవిత నష్టపరిహారం పరిగణలోకి తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని అన్నారు అనంతరం మండల తహసీల్దార్ ను కలసి వినత పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి ప్రసాద్, జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పుష్పలత నాయక్, చక్రాయపేట మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు దశరథ రాయలు, ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ యాదవ్ , బిజెపి సీనియర్ నాయకులు, లక్ష్మి రెడ్డి జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి గారు వేమారెడ్డి, రామచంద్ర రెడ్డి , ఉమామహేశ్వరి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *