సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం రిపోర్టర్ భాగం స్వాతి సుధాకర్ మే 04: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ కి ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీ మాజీ సర్పంచ్ బి.ఆర్బి నాయుడు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని అన్నారు. పాఠశాలల్లో కల్పించిన ఆధునిక వసతులు, డిజిటల్ విద్య విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంచాయని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల లలో కేవలం మార్కులకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించేలా మంత్రి లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవ సత్ఫలితాలను ఇచ్చిందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖలో ఖాళీల భర్తీ, ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అందించడం ద్వారా బోధనా నాణ్యత పెరిగిందని అన్నారు. మంత్రి నారా లోకేష్ దూరదృష్టి, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. “చదువుల ఆంధ్రప్రదేశ్”గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన సాగిస్తున్న కృషికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు మంత్రి అభినందనలు తెలియజేయడం ఆయన సుపరి పాలనకు ఓ ఉదాహరణ అని అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా మరిన్ని సంస్కరణలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని బి.ఆర్బి నాయుడు పునరుద్ఘాటించారు.