సాక్షి డిజిటల్ న్యూస్ మే 4 అచ్చంపేట రూరల్ రిపోర్టర్. కాలూరి మల్లేష్: శాలువాతో సన్మానించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట. నియోజకవర్గం లింగాల మండలం నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం చంద్రకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కమిటీ సభ్యులచే శాలువాతో సన్మానం చేయడం జరిగింది. అనంతరం మండలంలోని పలు సమస్యలపై చర్చించి వివరాలు తెలుసుకున్నారు. మండల ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని ఎస్ఐ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పెరుమాండ్ల వెంకటేష్, అచ్చంపేట డివిజన్. అధ్యక్షులు కొమ్ము రేణుయ్య ఉపాధ్యక్షులు కాట్రావత్ శీను, ప్రచార కార్యదర్శి జి లక్ష్మీనారాయణ, కాలూరి మల్లేష్ , కమిటీ సభ్యులు సౌట సంజీవ్ కుమార్, సుందర్. తదితరులు పాల్గొన్నారు.