అమీనాబాద్ లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 03 2026 అనంతగిరి మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆరోగ్యశ్రీ,108,ఫీజు రీయింబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని, ఆయన బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వార్డు సభ్యులు బోడపూడి లక్ష్మీనారాయణ మీసాల రాజేష్, మాజీ ఉప సర్పంచ్ దేవపంగు కృష్ణ, బత్తిని రాజయ్య, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *