ఏనుగుల ఆహారం కోసం విస్తృత చర్యలు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యం లోని ఏనుగుల ఆహారం కోసం అటవీ అధికారులు బుధవారం విస్తృత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తాటి చెట్లు గింజలు అటువిప్రాంతంలో విస్తృతంగా నాటే కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా వాటికి ఇష్టమైన మరియు ఫలహారం అందించే వృక్షాలను నాటే చర్యలను చేపట్టారు. ఆహారం కోసం అడవిని వదిలి బయట ప్రాంతాలు సంచరించకుండా చేపట్టే విధంగా చేస్తున్నట్టు తెలిపారు రానున్న రోజుల్లో ఏనుగులు పూర్తిగా అడవిలోనే ఉంటూ ఆహారం నీరు సమృద్ధిగా లభించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ హరికుమార్ ఎఫ్ ఆర్ ఓ లు నిరంజన్ హరిబాబు గోవిందరాజులు ఏబీవోలు సుబ్రహ్మణ్యం రెస్కో డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *