కలిసికట్టుగా వైఎస్‌ఆర్‌సీపీని బలోపేతం చేద్దాం

వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ అనంతపురం, సెప్టెంబర్‌ 3: అనంతపురం జిల్లా ఇన్చార్జ్ అందరూ కలిసికట్టుగా పని చేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేద్దామని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం నగరంలోని రజకనగర్‌లో 43 నుంచి 48 డివిజన్ల పరిధిలో ఉన్న 60, 62 నుంచి 70 సచివాలయాల యువజన విభాగం నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. కూటమి పార్టీలు అపద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశాయన్నారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించారని విమర్శించారు. రెండేళ్లు దాటినా నిరుద్యోగ భృతి అమలు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. యువత, విద్యార్థులు, మహిళలను వెన్నుపోటు పొడిచారన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. రెండేళ్లుగా కూటమి నేతలు ప్రచార ఆర్భాటానికే పరిమితం అవుతున్నారని విమర్శించారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా బీసీ సెల్‌ ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాసులు, నగర ఉపాధ్యక్షులు ఇసాక్, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధానకార్యదర్శి హరి, మహిళ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు ప్రసన్న లక్ష్మి, యూత్‌ డివిజన్‌ అధ్యక్షులు వినోద్‌ కుమార్, డివిజన్‌ అధ్యక్షులు ప్రదీప్, మాలపాటి వెంకటేష్‌ సీనియర్‌ నాయకులు, బీసీ సెల్‌ నగర సెక్రటరీ మధు, మాజీ కార్పొరేటర్‌ టీవీ చంద్రమోహనరెడ్డి, రవికుమార్‌ యవజన జిల్లా ఉపాధ్యక్షుడు, 46 డివిజన్‌ యూత్‌ వింగ్‌ షెక్షావలి, అరవింద్, నారాయణ రెడ్డి రసూల్‌ రామచంద్ర 43 డివిజన్‌ కిషోర్‌ దను యూత్‌ నగర ఉపాధ్యక్షులు వినీత్‌ ఉదయకుమార్‌ మాసూద్‌ నగర కార్యదర్శి మైనుద్దీన్‌ యూత్‌ వింగ్‌ టౌన్‌ జనరల్‌ సెక్రెటరీ సాకే శ్రీనివాసులు ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షులు మరియు యువజన విభాగం కమిటీ మెంబర్స్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *