దుబ్బాక జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ ఉప సర్పంచ్ కోటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లను పంపిణీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో సమకూర్చిన స్పోర్ట్స్ డ్రెస్‌లను ఉపసర్పంచ్ కోతి శేఖర్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *