కాల్వ శ్రీరాంపూర్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3, కాల్వ శ్రీరాంపూర్: మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని అన్నారు. పార్టీ బలం కార్యకర్తలేనని, ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, కేంద్ర పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు, యువ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *