
సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3, మల్లాపూర్ మండల రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య : మల్లాపూర్ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంతడుపుల పుష్పలత – నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్ల సోమయ్య, పూండ్రా శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నూతిపల్లి రాజం, సిరిపురం రవీందర్, కోటగిరి ఆనంద్,ఎర్ర భూమయ్య, దప్పుల నర్సయ్య, బోదాసు నర్సారెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.