
సాక్షి డిజిటల్ సెప్టెంబర్ 3 కౌతాళం మండలం, కర్నూలు జిల్లా కౌతాళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వారి వర్ధంతి సందర్భంగా కౌతాళం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. దాట్ల సుబ్బరాజు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ.. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన మహానేత అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్ చేపట్టిన రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, పావలా వడ్డీ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో ఎంతో ప్రభావం చూపాయని దాట్ల సుబ్బరాజు తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంతోమంది నిరుపేదలకు ప్రాణదాతగా నిలిచిందన్నారు.
రైతు సంక్షేమానికి వైఎస్సార్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతులకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కార్యక్రమాలను అమలు చేసి పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారని తెలిపారు. జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించి, హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేసిన నాయకుడు వైఎస్సార్ అని దాట్ల సుబ్బరాజు అన్నారు.అయన ఆత్మ కు శాంతి కలగాలను మౌనం పాటించారు, మరియు ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన ప్రజా నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల కోసం చేసిన సేవలు, ఆయన చూపిన ప్రజా సంక్షేమ పాలన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. పేదవాడికి భరోసా, రైతుకు నమ్మకం, బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానేత వైఎస్సార్‌ను ఎప్పటికీ ప్రజలు మరచిపోలేరని అన్నారు, ఈ కార్యక్రమం లో వైఎస్సార్ సీపీ నాయకులు గణపతి రాజు కుమార్ రాజు డాక్టర్ అప్పులు ఎంపిటిసి రాజహమ్మద్, ఈడిగ సతీష్,ఈరేష్ ,ఆనంద్ సత్య గౌడ్ ఉపేంద్ర గౌడ్ రాము డ్రైవర్ లింగన్న మూలేమాన్ నరసింహులు ఎన్టీఆర్ నగర్ వీరేష్ సాయిబాబా మోదిన్ సాబ్ దాట్ల యూత్ తదితరులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.