
సాక్షి డిజిటల్ న్యూస్/ సెప్టెంబర్ 03 రిపోర్టర్ నోముల ఉపేందర్ . అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని చౌల్లరామారం గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్ సర్వీస్ పాయింట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు త్రివేణి నాగరాజు మాట్లాడుతూ..గ్రామ ప్రజలు నగదు జమ, నగదు ఉపసంహరణ, ఆధార్ ఆధారిత బ్యాంకింగ్, డబ్బు బదిలీ, బ్యాలెన్స్ విచారణ తదితర బ్యాంకింగ్ సేవలను బ్యాంకుకు వెళ్లకుండా గ్రామంలోనే సులభంగా పొందవచ్చని తెలిపారు. ఎస్బిఐ మినీ బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మందుల రేణుక కిరణ్, బ్యాంకు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీసీలు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.