కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన, ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్, ఎల్.బి. నగర్ నియోజకవర్గం ఇంచార్జి, సెప్టెంబర్ 3. రిపోర్టర్: ఎం. దుర్గా ప్రసాద్. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనతో 1000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *