దగా కోరు పాలనపై రణరంగంగా మారిన కుత్బుల్లాపూర్ చౌరస్తా గంధం సుధాకర్ గౌడ్

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గౌడ్ సెప్టెంబర్ 3 ఉత్బుల్లాపూర్ 420 దొంగ హామీలకు 420 అడుగుల బ్యానర్‌తో వినూత్న నిరసన. వాగ్దానాలు ఎన్నో అమలు మాత్రం శూన్యం ఎన్నికల ముందు హామీల వర్షం అధికారంలోకి వచ్చాక ప్రజలపై నిర్లక్ష్యం. ఆరు గ్యారెంటీలు ఎక్కడ. రైతు భరోసా ఏమైంది. మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. యువతకు ఉద్యోగాల మాట ఏమైంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ కలిసిపోయాయి. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ శ్రేణులు. 420 హామీల అమలు కోసం కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కె.పి.వివేకానంద్ ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గర్జించిన బీఆర్ఎస్ శ్రేణులు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు రేవంత్ సర్కార్ ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు: కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసనలో భాగంగా కుత్బుల్లాపూర్ లో మొదటి రోజు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మీడియా ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి తమ నిరసనను తెలియజేసి ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా పాల్గొన్నారో, నేడు గులాబీ దండును చూస్తుంటే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే రేవంత్ సర్కార్ కెసిఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతూ ప్రజలను దారిమల్లిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజలకు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ సమర శంఖం పూరించింది. రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు రేవంత్ సర్కార్ ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. విద్యార్థిని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నడు. విద్యాభరోసా కార్డు అన్నడు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తాం, జాబ్ క్యాలెండర్ అన్నడు. కల్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తా అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటవ్ రేవంత్ రెడ్డి. మీ కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నడు నమ్మలేదు, అందుకే ఢిల్లీ నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పిలిపించుకొని దొంగ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారు. రేవంత్ రెడ్డి తన అనుయాయులతో స్క్వేర్ ఫీట్ కు వంద రూపాయలను వసూలు చేసే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు నందో, పందో, పందికొక్కొ అసెంబ్లీలో తెలుస్తాం. కేసీఆర్ ని రాజీనామా చేయాలని ప్రజలను కోరాలని కాంగ్రెస్ నాయకులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయమంటున్నవ్ కదా రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లితే బట్టలిప్పి కొట్టడం ఖాయం.
ఈ నిరసన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *