సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3, 2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో నిరసన చేపట్టారు. కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ 420 మీటర్ల భారీ ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు బాకీ కార్డులు, కరపత్రాలను పంపిణీ చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. తాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 420 హామీల అమలు పరిస్థితిని ప్రజల ముందుంచడమే లక్ష్యమన్నారు. రాబోయే ఏడు రోజుల పాటు రోజుకొక నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.