స్కూలు విద్యార్థులకు, సైబర్ క్రైమ్ పై అవగాహన

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్:-సెప్టెంబర్ 3 శామీర్ పేట మండలం: మేడ్చల్ జిల్లా, రిపోర్టర్:-(వెంకటకృష్ణారావు) శ్రీ చైతన్య స్కూల్‌లో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్ పేట మండలం, జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్ శ్రీ చైతన్య స్కూల్‌లో జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలు, OTPలు, పాస్‌వర్డ్‌లను అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా సీఐ గోపగాని గురువయ్య గౌడ్, మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థులు మరియు ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి, సురక్షితమైన ఆన్‌లైన్ విధానాలను పాటించాలని జీనోమ్ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ విద్యార్థులకు మరియు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *