పేదల పక్షపాతి రైతు బాంధవుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి.

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబరు 03 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య) పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో బుధవారం వైస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భముగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మార్క్ పెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు డాకూరి వెంకటేశం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రములో పాదయాత్ర చేసి నిరుపేదల,విద్యార్థుల కష్టాలను చూసి చలించి పోయి రాష్ట్రములో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉచిత విద్యుత్ పైన సంతకము చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వారి కష్టాల్లో ఆడుకున్న రైతు భాండవుడు అయ్యాడు.అలాగే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందచేసి ఆరోగ్య ప్రదాత అయ్యాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యా ప్రదాత అయ్యాడు రాష్ట్రములో ఎన్నొ సంక్షేమ పథకాలు అందించి పేదల పక్షపాతిగా నిలిచాడు అన్నారు. అలాగే రాష్ట్రములో తన పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఘనత ఆయనదే అన్నారు ఆందోల్ నియోజకవర్గానికి సింగూర్ జలాలు ఇచ్చి 40000 వేల ఎకరాలు సస్యశ్యామలం చేశారు అని కొనియాడారు. ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్,కౌన్సిలర్స్ కోశికే రాజశేఖర్,హరికృష్ణ,రామకృష్ణ,పట్లోల్ల శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్స్ కోరబోయిన నాగరాజు నాని,తుపాకుల సునిల్,శరత్ బాబు, పిట్ల లక్ష్మణ్,కో ఆప్షన్ మెంబెర్ ప్రవీణ్,ఆత్మ కమిటీ సభ్యులు చిట్యాల మధు, ఖలేద్,నాయకులు దాకూరి శ్రీనివాస్,బేగారి అనిల్,ఆకుల నందు,కొత్త శ్రీశైలం,గొహేర్ అలీ,అబ్బాస్ అలీ,మురళి బండల సంతోష్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *