
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబరు 03 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య) తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జోగిపేట లో నిరసన ర్యాలీతో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి ఆరు గ్యారంటీల అమలు తీరు పూర్తిగా హాస్యాస్పదంగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి, వంచించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత వెయ్యి రోజులుగా కేవలం కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీస్తోంది.అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో సుసంపన్నంగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పాలకులు చేతగానితనంతో కుప్పకూల్చారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ విమర్శించారు. అభివృద్ధి పనులకు నిధులు లేవని, కానీ వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, విఫలమైన హామీలపై బీఆర్‌ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా చేస్తామని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ పట్లూరి శేఖర్ ,చాపల వెంకటేశం, నాగభూషణం, వీరభద్రయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.