
సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్ట్ భైరంనారాయణ 3 సెప్టెంబర్ 26 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగానిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తూ బొంకూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఎండి జయెద-రజాక్ పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముల్కల శిరీష శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ చిర్ర దిలీప్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాపల్లి గంగన్న సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రంగదామునిపల్లి సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జెల్ల అనిల్ స్థానిక వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎండి జయెదరజాక్ మాట్లాడుతూతమ సొంత ఇంటి కలను సాకారం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిలువ నీడలేని నిరుపేదలను అక్కున చేర్చుకుని వారి జీవితాల్లో సంతోషం నింపే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని వారు పేర్కొన్నారుపేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు.