లచ్చా నాయక్ తండాలో అభివృద్ధి పనులకు శ్రీకారం

రూ.50 లక్షలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ 03.09.26 జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జి కొడిపెల్లి సురేష్/ సారంగాపూర్ (రేచపల్లి): మండలంలోని లచ్చా నాయక్ తండా గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి భూమిపూజ చేశారు. అలాగే రూ.20 లక్షల నిధులతో గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ అధికారి మదన్ మోహన్, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధికారి విమల, మండల అభివృద్ధి అధికారి నీరజ, తహసీల్దార్ వాహిదోద్దీన్, మండల పంచాయతీ అధికారి సలీం, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సొల్లు సురేందర్, సర్పంచ్ గడ్డం గంగారాం, ఉప సర్పంచ్ బోడుగం రజిత, సర్పంచ్‌లు బాస మహేష్, మ్యాకల శేఖర్, ఉప సర్పంచ్ ఉపేందర్, కొలపాక రాజు, చెకుట శేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, గుర్రాల రాజేందర్ రెడ్డి, సుధాకర్ రావు, బాలె సత్యనారాయణ, రమేష్, మాజీ సర్పంచులు, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *