
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్ల మండల ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు కీర్తిశేషులు గంటే రాందాస్ సతీమణి గంటే వెంకటమ్మ (98) దశదినకర్మ కార్యక్రమం గార్ల మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు, సంభాని చంద్రశేఖర్ హాజరై వెంకటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గంటే వెంకటమ్మ మృతి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులకు, ఆమెను ఆప్యాయంగా అభిమానించిన వారికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంకటమ్మ దశదినకర్మ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సామాజిక, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. టీచర్స్ యూనియన్ నాయకులు ఇరు నాయక్, గంగావతి శ్రీను నాయక్, రిటైర్డ్ టీచర్ కొలనుపాక శ్రీనివాస్ రావు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే గంటే రాందాస్ కుటుంబ సభ్యులు గంటే శ్రీనివాసరావు, గంటే రవి, గంటే రాము తదితరులతో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు కార్యక్రమానికి హాజరై గంటే వెంకటమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, వెంకటమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.