వేములవాడ నియోజకవర్గంలో విషాదం

సాక్షి డిజిటల్ న్యూస్ మే.04 వేములవాడ ఆర్ సి ఇంచార్జ్ సయ్యద్ షబ్బీర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ మల్యాల రమేష్ తండ్రి మల్యాల రాములు మరణించారు. అలాగే తాండ్రియల్ గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాచమడుగు గంగారావు తల్లి రాచమడుగు లక్ష్మీ కూడా పరమపదించారు. ఈ దుర్ఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు సహా పలువురు నాయకులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. పరామర్శ కార్యక్రమంలో మహ్మద్ రఫీ, కాసారపు జలంధర్, బాల్క సంజీవ్, పాలేపు రాజేష్, గడ్డం ప్రతాప్ రెడ్డి, తెడ్డు ప్రశాంత్, మంచాల మహేష్, మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని నాయకులు ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *