వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ రాజా రమేష్

సాక్షి డిజిటల్ న్యూస్, మే 4 మణుగూరు భద్రాద్రికొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: సింగరేణి మణుగూరు ఏరియా ప్రాంతీయ హాస్పటల్ నందు రెండు దశాబ్దాల పాటు వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ రాజా రమేష్ కొంత కాలం క్రితం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా హాస్పిటల్ బదిలీపై వెళ్లి కొంతకాలం వైద్య సేవలు అందించి ఆ తరువాత తన వైద్య వృత్తికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాలలో ప్రవేశించారు. వారి సతీమణి డాక్టర్ సంధ్యారాణి కూడా భర్తతో పాటు రాజకీయాలలో ప్రవేశించి మున్సిపల్ ఎన్నికలలో అరుదైన విశేషం చెన్నూరు నియోజకవర్గం కాంతన పల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసి మేయర్గా ఎన్నికయ్యారు. సింగరేణి చరిత్రలో సింగరేణి కుటుంబం నుండి మేయర్ గా ఒక మహిళ ఎన్నిక కావడం అరుదైన విశేషం. మణుగూరు ప్రాంతీయ వైద్యశాలలో డాక్టర్ రాజా రమేష్ విశేష ఆదరణ పొందిన వైద్యుడిగా సాంఘిక సేవా కార్యక్రమాలలో ముందుండేవారు. రాజకీయాలలో సైతం గొప్ప ఆదరణ పొందాలని వైద్య వృద్ధికి రాజీనామా చేసి చెన్నూరు నియోజకవర్గంలో వివిధ సాంఘిక సేవా కార్యక్రమాలలో ముందుంటూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నేతగా ఎదిగారు. కరోనా సమయములో ఆయన అందించిన సేవలు మానవీయ కోణానికి అద్దం పట్టింది, భార్యా భర్తలిద్దరూ బి ఆర్ ఎస్ పార్టీలో కొనసాగడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *